Javascript required
Skip to content Skip to sidebar Skip to footer

Diabetes Diet Food List in Telugu

షుగర్ పేషెంట్స్‌ రోజూ ఇవి తింటే మంచిదట..

| Samayam Telugu | Updated: Jan 29, 2021, 10:13 AM

షుగర్ వ్యాధి వచ్చిందంటే చాలు.. దీంతో పాటు మరెన్నో సమస్యలు చుట్టుముడతాయి. అందుకే దీనిని కంట్రోల్ చేసుకోవాలి. ఇందుకు ఆ పేషెంట్స్ ప్రత్యేకమైన డైట్ అలవాటు చేసుకోవాలి. ఆ డైట్ ఏంటో తెలుసుకోండి.

glucose-meter-with-medical-stethoscope-fruits-and-dumbbells-picture-id490798672

ఇండియా ప్రస్తుతం ప్రపంచానికి డయాబెటీస్‌కి రాజధానిలా ఉంది. ఇండియాలో ప్రస్తుతం డెబ్భై ఏడు మిలియన్ల ప్రజలు ఈ వ్యాధితో బాధ పడుతున్నారు. ఈ కండిషన్ గురించి అవగాహన ఉంటే ఈ వ్యాధిని త్వరగా కనుక్కోవచ్చు. ట్రీట్మెంట్ కూడా సులభంగా ఉంటుంది. ఈ వ్యాధికి సంబంధించినంత వరకూ ఒక విషయం మాత్రం అందరికీ తెలుసు. ఆహార విహారాల్లో కొన్ని తేలికపాటి మార్పులు చేయడం ద్వారా ఈ వ్యాధిని చాలా సులభం గా కంట్రోల్ చేయవచ్చనీ, ఈ మార్పుల వల్ల ఒక్కోసారి ఈ వ్యాధి పూర్తిగా తగ్గిపోవచ్చనీ. ఆహరం గురించి మాట్లాడినప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా గ్లూటెన్ ఫ్రీ డైట్ కి బాగా ఆదరణ పెరిగింది. కానీ, చాలా మందికి ఈ డైట్ విషయం లో కొంత కన్‌ఫ్యూజన్ ఉంది. గ్లూటెన్ ఫ్రీ డైట్ గురించి ప్రజల్లో ఉన్న కొన్ని అపోహల్లో ముఖ్యమైనది ఈ డైట్. బరువు తగ్గడానికి డిజైన్ చేయబడిందని, కానీ అది నిజం కాదు. Also Read : ఈ టీ తాగితే కాన్సర్ రాదట..

అసలీ గ్లూటెన్ ఫ్రీ డైట్ అంటే ఏంటి..

గ్లూటెన్ ఫ్రీ డైట్ అంటే లోపల ప్రేవులు శుభ్రపడే ఆహారం తీసుకోవడం, ఫలితంగా మనం తీసుకుంటున్న ఆహారంలోని పోషకాలని శరీరం తేలిగ్గా, ఎక్కువ ప్రభావవంతంగా గ్రహించగలుగుతుంది. గోధుమలు, బార్లీ వంటి ధాన్యాల్లో ఈ గ్లూటెన్ అనబడే ఈ ప్రోటీన్ ఉంటుంది. గ్లూటెన్ వల్ల డయాబెటిస్ పేషెంట్స్‌కి ఎలాంటి హానీ జరగదు. అందుకని వారు ప్రత్యేకంగా ఈ గ్లూటెన్ ఫ్రీ డైట్ తీసుకోవలసిన అవసరం లేదు. నిజానికి, డయాబెటీస్ ఉన్నా లేకపోయినా చాలా మంది ప్రజలు గ్లూటెన్ ఫ్రీ డైట్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు.

గ్లూటెన్, డయాబెటీస్..

శరీరం గ్లూటెన్ కి రెండు రకాల ఆరోగ్య పరిస్థితుల్లో కొంచెం తేడాగా రియాక్ట్ అవుతుంది. అవి గ్లూటెన్ ఇంటాలరెన్స్, గ్లూటెన్ సెన్సిటివిటీ. సీలియాక్ డిసీజ్ ఉన్న వారు మాత్రం గ్లూటెన్ తీసుకోకూడదు. అయితే, గ్లూటెన్ కలిగి ఉండి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని పెంచే ఎన్నో రకాల ఆహార పదార్ధాలు ఉన్నాయి.

Also Read : ఈ రాశి వారు శృంగారాన్ని ఎక్కువగా ఇష్టపడతారట..

సీలియాక్ డిసీజ్, టైప్ 1 డయాబెటీస్..

సీలియాక్ డిసీజ్, టైప్ 1 డయాబెటీస్ రెండింటికీ ఒక లింక్ ఉంది - ఈ రెండు కండిషన్స్ వల్లా శరీరం లో సివియర్ గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఏర్పడుతుంది, రెండూ కూడా ఆటో ఇమ్యూన్ కండిషన్సే. పరిశోధనల ప్రకారం, టైప్ 1 డయాబెటీస్ ఉన్న వారిలో 19.7 శాతం మందికి సీలియాక్ డిసీజ్ కూడా ఉంది. సీలియాక్ డిసీజ్ కొంచెం అరుదుగా కనబడే వ్యాధే, అందుకని ఇది డయాగ్నోజ్ చేయబడకుండా ఉండిపోతుంది. ఈ వ్యాధి ప్రేవుల్లో ఇన్‌ఫ్లమేషన్ ని కలుగజేసి తీసుకున్న ఆహారంలో నుండి పోషకాలను గ్రహించకుండా అడ్డుకుంటుంది. అయితే, టైప్ 1 డయాబెటీస్ బాధపడుతున్న పిల్లలకి గ్లూటెన్ ఫ్రీ డైట్ హెల్ప్‌ఫుల్ గా ఉంటుందని తెలిసింది. అంతే కాక, స్త్రీ గ్లూటెన్ ఫ్రీ డైట్ ని ఫాలో అయితే ఆమెకి పుట్టే బిడ్డకి టైప్ 1 డయాబెటీస్ రాదని కూడా స్టడీస్ ద్వారా తెలిసింది.

గ్లూటెన్ ఫ్రీ డైట్, టైప్ 2 డయాబెటీస్..

గ్లూటెన్ వల్ల ఒబెసిటీ రిస్క్ కొంత తగ్గుతుందని స్టడీస్ చెబుతున్నాయి. మనందరికీ తెలిసిన విషయమే, టైప్ 2 డయాబెటీస్ కి ఒబేసిటీ కూడా ఒక ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్. అందువల్ల గ్లూటెన్ ఫ్రీ డైట్ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వారికి కొంత హెల్ప్ చేయగలదు. అయితే, ఇది ఇంకా శాస్త్రీయం గా నిరూపణ కాలేదు. డాక్టర్లూ, పోషకాహార నిపుణులూ ఇంకా టైప్ 2 డయాబెటీస్ పేషెంట్లకి గ్లూటెన్ ఫ్రీ డైట్ ని రికమెండ్ చేయడం లేదు.

Also Read : 45 ఏళ్ళ తర్వాత చాలా మందికి ఈ కాన్సర్ వస్తుందట..

ఇంతకీ..

నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, ఎవరైనా టైప్ 1 డయాబెటీస్, సీలియాక్ డిసీజ్, లేదా మరే ఇతర గ్లూటెన్ ఎలర్జీ తో డయాగ్నోజ్ అయితే తప్ప గ్లూటెన్ ని ఎవాయిడ్ చేయటం కంటే తీసుకునే కార్బోహైడ్రేట్స్ యొక్క క్వాలిటీ, మరియు క్వాంటిటీ మీద దృష్టి పెట్టడం మంచిది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి

Web Title : the best and healthy foods to control diabetes know here in telugu
Telugu News from Samayam Telugu, TIL Network

Diabetes Diet Food List in Telugu

Source: https://telugu.samayam.com/lifestyle/health/the-best-and-healthy-foods-to-control-diabetes-know-here-in-telugu/articleshow/79391426.cms